తల్లిని చంపి సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన కూతురు

  • బెంగళూరులో ఘటన
  • నిందితురాలు 39 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్
  • సూట్‌కేసులో తీసుకొచ్చిన శవాన్ని చూసి పోలీసుల షాక్
  • రోజూ గొడవ పడుతుండడంతోనే చంపేశానన్న నిందితురాలు
తల్లితో చాలాసేపు గొడవ పడిన కుమార్తె ఆ తర్వాత సహనం కోల్పోయి ఆమెను చంపేసి శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. బెంగళూరులో జరిగిందీ ఘటన. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తోంది. సూట్‌కేసులో ఆమె తీసుకొచ్చిన తల్లి శవాన్ని చూసి షాకైన పోలీసులు ఆ తర్వాత తేరుకుని అరెస్ట్ చేశారు. 

తల్లి తనతో రోజూ గొడవ పడుతోందని, అందుకే ఆమెను చంపేశానని ఆమె అంగీకరించింది. ఘటన జరిగిన సమయంలో నిందితురాలి భర్త ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ నిందితురాలు తన గదిలో ఈ హత్యకు పాల్పడడంతో ఆమెకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News