చెప్పులు పోవడంతో మాజీ మేయర్ గుస్సా.. నాలుగు కుక్కలకు స్టెరిలైజేషన్

  • ఔరంగాబాద్‌లో మాజీ మేయర్ నందకుమార్ చెప్పుల చోరీ
  • ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్కలు చెప్పులు ఎత్తుకెళ్లాయని సిబ్బంది అనుమానం
  • మున్సిపల్ అధికారులకు మాజీ మేయర్ ఫిర్యాదు
  • వీధి కుక్కలను పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్
  • సిబ్బందికి చిక్కిన కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్
మాజీ మేయర్ ఆగ్రహానికి గురైన నాలుగు వీధి కుక్కలకు అధికారులు స్టెరిలైజేషన్ చేసిన ఘటన ఔరంగాబాద్‌లో వెలుగు చూసింది. నక్షత్రవాడీ ప్రాంతంలో ఉండే మాజీ మేయర్ నందకుమార్ చెప్పులు ఇటీవల కనిపించకుండా పోయాయి. ఇంటి గేటు తెరిచి ఉండటంతో లోపలికొచ్చిన కుక్కలు చెప్పులు ఎత్తికెళ్లి ఉండొచ్చని సిబ్బంది అనుమానించారు. 

దీంతో, నంద కుమార్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వీధికుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో మేయర్ నివాసానికి సమీపంలో పట్టుబడ్డ నాలుగు కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, కుక్కలకు సాధారణంగా స్టెరిలైజేషన్ చేస్తూనే ఉంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మాజీ మేయర్ మాత్రం మౌనం వహించడం గమనార్హం.


More Telugu News