తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం: పవన్ పై రామ్ గోపాల్ వర్మ విమర్శలు

  • పీక పిసికేస్తా, బట్టలూడదీస్తా అని పవన్ అంటున్నారని వర్మ విమర్శ
  • తన ఫాలోయర్స్ కి వయోలెన్స్ ని ప్రబోధిస్తున్నారని వ్యాఖ్య
  • మీటింగులకు వచ్చే యువకులు ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్న
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. తను అనుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకి వస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం వొలిచేస్తాలాంటి హింసాత్మకమైన బెదిరింపులు హిట్లర్, సద్దాం హుస్సేన్, కిమ్ జాంగ్ సహా ఎవరూ అనుండరని ఆర్జీవీ అన్నారు.  

ఇంకో విషయమేంటంటే, అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయొచ్చు అని చెప్పడమా? అని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రబోధించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వమని చెప్పారు. ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగులకు వచ్చే ఆ యువకులు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ పవన్ కల్యాణ్ కే తెలియాలి అని అన్నారు.


More Telugu News