ఎంత ఆనందాన్ని పొందానో మాటల్లో వర్ణించలేను: ఇలియానా

  • ప్రస్తుతం ఇలియానా గర్భవతి
  • బేబీ హార్ట్ బీట్ ను తొలిసారి వినడం ఆనంద క్షణాల్లో ఒకటని వ్యాఖ్య
  • ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఇలియానా
సినీ నటి ఇలియానా ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ, తన బేబీ హార్ట్ బీట్ ను తొలిసారి వినడం అత్యంత ఆనందమైన క్షణాల్లో ఒకటని చెప్పింది. ఎంతటి ఆనందాన్ని పొందానో మాటల్లో చెప్పలేనని అంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం అనేది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదని చెప్పింది. 

మన శరీరం చెప్పేదే మనం వినాలని, ఎవరో చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. తాను కూడా మనిషినేనని, కొన్నిసార్లు తాను కూడా బాధపడ్డానని చెప్పింది. తన చుట్టూ ఉన్న వ్యక్తులు గొప్పవారని, తనలో ఒక జీవి ప్రాణం పోసుకుంటోందనే విషయాన్ని తరచూ గుర్తు చేసేవారని తెలిపింది. తనకు ఇండియన్ ఫుడ్ తినాలని ఉందని, ముంబై ఫుడ్ ను బాగా మిస్ అవుతున్నానని చెప్పింది. ప్రస్తుతం ఇలియానా కెరీర్ కు బ్రేక్ తీసుకుని విదేశాల్లో ఉంటోంది.


More Telugu News