భారత దేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారు: సీఎం కేసీఆర్
- నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి
- పీవీ సేవలను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్
- ఆయన స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకెళ్తామని ప్రకటన
ఈ రోజు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారని సీఎం కేసీఆర్ కొనియాడారు. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అన్నారు.
నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని అన్నారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు.