గెలిచిన నాలుగేళ్లకు ఊరు గుర్తుకు వచ్చిందా?: మంత్రి అమర్నాథ్‌కు మహిళ నిలదీత

  • అనకాపల్లి మండలం కొత్త తలారివారిపాలెంలో కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • శిలాఫలకం ఆవిష్కరించిన సమయంలో మహిళల నిలదీత
  • మంత్రి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసుల అడ్డగింత
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నిరసన సెగ తగిలింది. గెలిచిన నాలుగేళ్ల తర్వాత ఊరు గుర్తుకు వచ్చిందా? అంటూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఎన్నికలు సమీపించాయని, అందుకే వచ్చావా? ఓట్ల కోసమే జనాలు గుర్తుకు వస్తారా? అని ప్రశ్నించింది. అనకాపల్లి మండలం కొత్త తలారివారిపాలెంలో కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం ఆవిష్కరించిన సమయంలో మంత్రిపై పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు.

పలువురు మహిళలు మంత్రి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కాలువ పనులకు మంత్రి శిలాఫలకం ఆవిష్కరించిన కొన్ని గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ధ్వంసం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.


More Telugu News