"మైడియర్ మార్కండేయా చెబుతా రాసుకో"... 'బ్రో' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
- పవన్, సాయితేజ్ ప్రధానపాత్రల్లో బ్రో
- సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
- ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో విడుదల చేసిన చిత్రబృందం
- తమన్ స్వరాలకు సాహిత్యం అందించిన రామజోగయ్యశాస్త్రి
- జులై 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న బ్రో
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో చిత్రం నుంచి తొలి సింగిల్ రిలీజ్ అయింది. "మైడియర్ మార్కండేయా మంచి మాట చెబుతా రాసుకో... మళ్లీ పుట్టి భూమ్మీదకి రానే రావు తెలుసుకో" అంటూ సాగే ఈ పాట ఆద్యంతం హుషారెత్తించేలా ఉంది.
ఈ పాటకు తమన్ స్వరాలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటలో బాలీవుడ్ ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలా అదనపు ఆకర్షణ.
కాగా, ఈ పాట లిరికల్ వీడియో యూట్యూబ్ లోకి వచ్చిందో లేదో వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోపు పవర్ స్టార్ అభిమానులను అలరించేందుకు చిత్రబృందం మరిన్ని అప్ డేట్లు, ఇతర పాటలను తీసుకురానుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ కథానాయికలు. పవన్ కల్యాణ్ ఆప్తమిత్రుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రో చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగులు అందించడం విశేషం.