ముద్రగడ వైసీపీలోకి వస్తానంటే తప్పకుండా స్వాగతిస్తాం: ఎంపీ మిథున్‌రెడ్డి
- తనకు బలం లేదని గతంలో పవన్ కల్యాణే ఒప్పుకున్నారన్న మిథున్‌రెడ్డి
- టీడీపీతో పొత్తు కోసమే ఆయన మాట్లాడుతున్నారని విమర్శ
- లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని వెల్లడి
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలోకి వస్తానంటే తప్పకుండా స్వాగతిస్తామని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తాము లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని పరోక్షంగా చెప్పేశారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని మిథున్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిని కానని గతంలో పవన్ చెప్పారన్నారు. అంత బలం తనకు లేదని స్వయంగా పవన్ అన్నారని గుర్తు చేశారు.

‘గడప గడపకు ప్రభుత్వం’ ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, వారే తమ పార్టీ అభ్యర్థులని మిథున్‌రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
ప్రజలతో నేరుగా ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని చెప్పారు. అందుకే, తమవల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజలతో నేరుగా ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని చెప్పారు. అందుకే, తమవల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు.