'హిడింబ' నుంచి రివర్స్ యాక్షన్ ట్రైలర్!
- అశ్విన్ బాబు హీరోగా రూపొందిన 'హిడింబ'
- కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న అనిల్ కన్నెగంటి
- కథానాయికగా అలరించనున్న శ్వేత మీనన్
- ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న సినిమా
అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన 'హిడింబ' ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో కథానాయికగా శ్వేత మీనన్ అలరించనుంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, వికాస్ సంగీతాన్ని సమకూర్చాడు.
తాజాగా ఈ సినిమా నుంచి రివర్స్ యాక్షన్ ట్రైలర్ అంటూ, మరో స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రతి షాట్ ను రివర్స్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ కొత్తగా అనిపిస్తోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, కీలకమైన దృశ్యాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అనిల్ కన్నెగంటి గతంలో సందీప్ కిషన్ తో 'రన్' .. ' మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' .. కల్యాణ్ రామ్ తో 'అసాధ్యుడు' చేశాడు. అలాంటి ఆయన నుంచి వస్తున్న మరో సినిమానే, 'హిడింబ'. కొత్త కాన్సెప్ట్ తో ఆయన రూపొందించిన ఈ సినిమా, ఆయన ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న హిట్ పట్టుకొస్తుందేమో చూడాలి.