అక్టోబరు నెలకు సంబంధించి వివిధ సేవల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

  • ఈ నెల 18 నుంచి 20 వరకు లక్కీ డిప్ విధానంలో కేటాయించే టికెట్ల విడుదల
  • జులై 21 నుంచి పలు రకాల సేవల టికెట్ల విడుదల
  • జులై 24న అంగప్రదక్షిణం టోకెన్ల జారీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్టోబరు నెలకు సంబంధించి వివిధ రకాల శ్రీవారి సేవల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. జులై 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేయనుంది. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు డబ్బులు చెల్లించి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇక, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, ఊంజల్ సేవల టికెట్లను జులై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అంగప్రదక్షిణ టోకెన్లను జులై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. టికెట్లను https://online.tirupatibalaji.ap.gov.in పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.


More Telugu News