జోకోవిచ్ స్పీడుకు అల్కరాస్ బ్రేకులు! తదుపరి యూఎస్ ఓపెన్‌పై సర్వత్రా ఉత్కంఠ
- జోకోవిచ్‌ను మట్టికరిపించి వింబుల్డెన్‌ను ఎగరేసుకుపోయిన అల్కరాస్
- 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేతగా నిలిచేందుకు బరిలోకి దిగిన జోకోవిచ్‌కు తీవ్ర నిరాశ
- తదుపరి యూఎస్ ఓపెన్ రూపంలో జోకోవిచ్‌కు మరో అవకాశం
- ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి అల్కరాస్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ
గ్రాండ్ స్లామ్స్ పేరు చెబితే టెన్నిస్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చే ఛాంపియన్ నోవాక్ జకోవిచ్. సెరెనా విలియమ్స్, ఫెడరర్, నడాల్, వంటి ఆల్ గ్రేట్ అనిపించుకోదగ్గ పేరు ప్రఖ్యాతులు అతడి సొంతం. ఇటీవలి వింబుల్డెన్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు జోకో రంగంలోకి దిగాడు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఓ అరుదైన రికార్డు అతడి సొంతమై ఉండేది. వరుసగా ఐదు, అత్యధికంగా ఎనిమిది వింబుల్డెన్ టైటిల్స్ రికార్డుతో పాటూ అత్యధిక ప్రీఓపెన్ ఎరా గ్రాండ్ స్లామ్ టైటిల్స్(24) గెలుచుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు.
కానీ, స్పెయిన్ యువ కెరటం అల్కరాస్ వింబుల్డెన్‌లో జోకో స్పీడుకు ఊహించని విధంగా బ్రేక్ వేశాడు. తొలుత కాస్త తడబడ్డా ఆ తరువాత జోకోకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. 1-6, 7-6(8/6), 6-1, 3-6, 6-4తో సెర్బియా దిగ్గజాన్ని మట్టికరిపించాడు. అల్కరాస్‌కు ఇది రెండో గ్రాండ్ స్లామ్. కాగా, 2018లో జోకోవిచ్ చివరిసారిగా యూఎస్ ఓపెన్‌లో గెలిచాడు. ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ మాత్రం అల్కరాసయే. దీంతో, అల్కరాస్ అప్రతిహత విజయపరంపరకు ఇది తొలి అడుగేనన్న విశ్లేషణలు ఇప్పటికే ఊపందుకున్నాయి.
ఇప్పటివరకూ అత్యధిక ప్రీ ఓపెన్ ఎరా గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్న క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ రికార్డు నెలకొల్పింది. సెరెనా రికార్డును బ్రేక్ చేసేందుకు జోకో ఒక గ్రాండ్ స్లామ్ దూరంలో నిలిచాడు. తదుపరి జరిగే యూఎస్ ఓపెన్‌లో జోకోకు మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. కానీ, ఆ టోర్నమెంట్‌లో అతడు ఎదుర్కోబోయేది డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాస్‌నే! దీంతో, టెన్నిస్ అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ పెరిగిపోయింది. రాబోయే టోర్నమెంట్‌లో జోకో తన కల నెరవేర్చుకుంటాడా? లేక యువకెరటం అల్కరాస్‌కు తలొగ్గి తెరమరుగవుతాడా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.