బీజేపీతో, టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తుపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు
- పవన్ ఛరిష్మాను ఉపయోగించుకుని బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్న జోగయ్య
- బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 2 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా
- టీడీపీతో పొత్తు జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య
ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య స్పందిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఛరిష్మాను ఉపయోగించుకుని బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని లేఖలో ఆయన చెప్పారు. జగన్ ను ఓడించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని అన్నారు. దీనికి కారణం ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చని చెప్పారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
టీడీపీ పాలనలో జరిగిన కొన్ని అంశాలు జనసేనకు వ్యతిరేకంగా మారొచ్చని జోగయ్య తెలిపారు. బీజేపీ మత రాజకీయాల వల్ల కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. జనసేన, బీజేపీల పొత్తు వల్ల బీజేపీకే ఎక్కువ లాభమని అన్నారు. చంద్రబాబు పరిపాలన దక్షత వల్ల టీడీపీతో పొత్తు జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పారు.