తదుపరి ఐపీఎల్ లో పంత్ కు స్థానం దక్కకపోవచ్చు: ఇశాంత్ శర్మ
- కారు ప్రమాదం తర్వాత కోలుకున్న పంత్
- బ్యాటింగ్ ప్రాక్టీసును మొదలు పెట్టినట్టు తెలిపిన బీసీసీఐ
- పంత్ ఫిట్ నెస్ సాధించడం కష్టమేనన్న ఇషాంత్ శర్మ
కారు యాక్సిడెంట్ తర్వాత టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కోలుకున్నాడు. పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ ను మొదలు పెట్టినట్టు బీసీసీఐ తెలిపింది. అయితే పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ప్లేయర్ ఇషాంత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ లో పంత్ కు స్థానం దక్కకపోవచ్చని ఇషాంత్ తెలిపాడు. పంత్ పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ ను సాధిస్తాడని తాను భావించడం లేదని చెప్పాడు.
పంత్ కు అయిన గాయాలు చిన్నవి కాదని చెప్పాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ ఉంటేనే ఆడగలడని తెలిపాడు. రెండో సర్జరీ కాకుండానే పంత్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని, ఇది మంచి విషయమని చెప్పాడు. మరో సర్జరీ అయి ఉంటే ఆటకు మరింత ఎక్కువ కాలం దూరంగా ఉండేవాడని అన్నాడు. వన్డే ప్రపంచ కప్ కు కూడా పంత్ ఫిట్ కాకపోవచ్చని చెప్పాడు. ఐపీఎల్ కు ఫిట్ నెస్ సాధించినా గొప్ప విషయమేనని ఇషాంత్ తెలిపాడు.
డిసెంబర్ 30న ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారును పంత్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో పంత్ శరీరం కాలిపోయింది. పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి.