'బ్రో' కథను ఇంకా 10 భాషల్లో చేస్తాను: సముద్రఖని
- తమిళంలో సక్సెస్ అయిన 'వినోదయా సితం'
- తెలుగులో హిట్ కొట్టిన 'బ్రో' సినిమా
- నెక్స్ట్ హిందీలో రీమేక్ చేస్తానన్న సముద్రఖని
- 12 భాషల్లో ఈ కథ చెప్పాలనేదే తన డ్రీమ్ అని వెల్లడి
సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'వినోదయా సితం' భారీ విజయాన్ని సాధించింది. అదే కథను ఆయన తెలుగులో 'బ్రో' టైటిల్ తో తెరకెక్కించారు. పవన్ - సాయితేజ్ చేసిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడారు.
"మరణం ఎవరికైనా తప్పదు .. కానీ అది ఎవరికీ కూడా తాను ఎప్పుడు వచ్చేది చెప్పదు. నిజానికి అది పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు మనకి సమయాన్ని గుర్తుచేస్తూ ఉంటే, ఒక ప్లాన్ ప్రకారం అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. 'బ్రో' సినిమాలో ఈ పాయింట్ ను టచ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసినదే అయినా ఈ పాయింట్ కనెక్ట్ అయింది" అని అన్నారు.
"ఈ సినిమాను నేను 12 భాషల్లో తెరకెక్కించాలని అనుకున్నాను. ఆల్రెడీ తెలుగు .. తమిళ భాషల్లో చేశాను. ఇంకా 10 భాషల్లో చేయవలసి ఉంది. నెక్స్ట్ హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి భాషలోను .. అక్కడి స్టార్స్ తో .. అక్కడి బడ్జెట్ కి తగినట్టుగానే ఈ సినిమా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.