బాధ్యతల స్వీకరణకు ముందు ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ
- 4న ఉదయం ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
- అదే రోజు హైదరాబాద్‌కు వచ్చి మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొననున్న సంజయ్
- మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి
కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ ఈ నెల 4వ తేదీన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సంజయ్‌ని బీజేపీలో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు.
కాగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే, గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మోదీ ఆశీస్సులు అందుకోనున్నారు.
ఆ తర్వాత 4వ తేదీ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చి, ఆ తర్వాత శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు పాల్గొంటారు.