ఆర్టీసీ బిల్లును పరిశీలించేందుకు కొంత సమయం కావాలి: గవర్నర్ తమిళిసై

  • ఆర్ధిక బిల్లు కావడంతో ముందుగా గవర్నర్ ఆమోదం కోసం వెళ్లిన బిల్లు   
  • బిల్లు నిన్ననే తన వద్దకు వచ్చిందన్న గవర్నర్ 
  • బిల్లుపై న్యాయ సలహాలు తీసుకుంటానన్న గవర్నర్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక బిల్లు కావడంతో దీనిని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గవర్నర్ తమిళిసై‌ ఆమోదం కోసం పంపించింది. అయితే, ఈ బిల్లుకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ బిల్లు నిన్ననే తన వద్దకు వచ్చిందని చెప్పారు. బిల్లును పరిశీలించి న్యాయ సలహాలు తీసుకుంటానని, అందుకు కొంత సమయం కావాలన్నారు. మరోపక్క, తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని భావించింది. 


More Telugu News