తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడంటూ హార్ధిక్ పాండ్యాపై తీవ్ర వివర్శలు
- విండీస్ తో జరిగిన మూడో టీ20లో ఇండియా జయకేతనం
- 49 పరుగులతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న తిలక్ వర్మ
- సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించిన హార్ధిక పాండ్యా
వెస్టిండీస్ తో నిన్న జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించింది. 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో మరోసారి మెరిశాడు. 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో పరుగు చేసి ఉంటే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునేవాడు. అయితే స్ట్రైకింగ్ లో ఉన్న హార్ధిక్ పాండ్యా సిక్స్ కొట్టి (18వ ఓవర్ ఐదవ బంతి) మ్యాచ్ ను ముగించాడు.
దీంతో, క్రికెట్ అభిమానులు హార్ధిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హార్ధిక్ అతిపెద్ద స్వార్థపరుడు అని మండిపడుతున్నారు. ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో సిక్స్ కొట్టాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తే వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునేవాడని అంటున్నారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించే విధానం ఇదేనా? అని దుయ్యబడుతున్నారు.