'భోళా శంకర్' టికెట్ రేటు పెంచాలని ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న నిర్మాత

  • చిరంజీవి హీరోగా భోళాశంకర్
  • ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై చిత్రం
  • మెహర్ రమేశ్ దర్శకత్వం
  • ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగా మూవీ
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, తమ చిత్రానికి టికెట్ రేటు పెంచాలని భోళా శంకర్ చిత్ర నిర్మాత ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులో మరికొన్ని వివరాలు పొందుపరచాల్సి ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు నిర్మాతకు సూచించాయి. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా కావడంతో ప్రభుత్వం ఆ మేరకు వివరాలు కోరినట్టు తెలుస్తోంది. 

ఇటీవల చిరంజీవి ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ మంత్రులు చిరంజీవిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు భోళా శంకర్ టికెట్ రేటు పెంచాలని ఏపీ ప్రభుత్వానికి నిర్మాత దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News