'విక్రమ్' రికార్డును అధిగమించిన 'జైలర్'

  • కమల్ కి భారీ విజయాన్ని తెచ్చిన 'విక్రమ్'
  • 6 రోజుల్లో ఆ సినిమా వసూళ్లు 410 కోట్లు 
  • 6 రోజుల్లో 'జైలర్' రాబట్టింది 416 కోట్లు
  • 'జైలర్'ను నిలబెట్టేసిన ట్రీట్మెంట్  

దేశవ్యాప్తంగా రజనీకాంత్ - కమలహాసన్ కి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవలసిన పనిలేదు. మొదటి నుంచి కూడా ఇద్దరూ సినిమాల విషయంలో ఒకరిని మించిన రికార్డును ఒకరు నమోదు చేస్తూనే వెళుతున్నారు. అలా ఈ మధ్య కాలంలో 'విక్రమ్' సినిమాతో కమల్ ఒక కొత్త రికార్డును సృష్టించారు. 

'విక్రమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో 410 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును 'జైలర్' అధిగమించినట్టుగా చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా భారీ  స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 రోజులలోనే ఈ సినిమా 416 కోట్ల రూపాయలను రాబట్టింది. 6 రోజుల వసూళ్ల విషయంలో ఇప్పటివరకూ 'విక్రమ్' పేరుతో ఉన్న రికార్డును 'జైలర్' బ్రేక్ చేసింది.   

'జైలర్' ఎమోషనల్ టచ్ తో సాగే రివేంజ్ డ్రామా. కథ మరీ కొత్తది కాకపోయినా, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. కథ ప్రకారం హీరో రిటైర్మెంట్ తీసుకున్న 'జైలర్'. అందువలన విలన్ తో తలపడే విషయంలో ఆయనే అన్నీ చేసేసినట్టుగా కాకుండా, జాకీ ష్రాఫ్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ పాత్రల సాయం తీసుకోవడం కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. 


More Telugu News