చంద్రమండలాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహరాజ్
- ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును ప్రకటించకముందే ఈ చర్య చేపట్టాలని సూచన
- ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సలహా
చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ ప్రభుత్వాన్ని కోరారు. ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును చాటుకునే లోపే చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేసినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించిన అనంతరం ఈ ప్రదేశాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని కూడా పేర్కొన్నారు. కాగా, స్వామి చక్రపాణి మహరాజ్ గతంలోనూ తన వింత వ్యాఖ్యలతో కలకలం రేపారు. కొవిడ్ తొలి వేవ్ సమయంలో ‘గోమూత్ర పార్టీ’ నిర్వహించి సంచలనం సృష్టించారు.