విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ 'ఖుషి' అయినట్టేనా?

  • ఈ నెల 1వ తేదీన వచ్చిన 'ఖుషి'
  • వీకెండులో సాగిన హవా  
  • ఆ తరువాత తగ్గిన జోరు
  • కాంబినేషన్ సెట్ కాలేదనే కామెంట్  
విజయ్ దేవరకొండ అభిమానులంతా అత్యవసరంగా ఆయనకి ఒక హిట్ పడాలనే కంగారులో ఉన్నారు. అందుకు కారణం, 'లైగర్' సినిమాతో ఆయన మూడు ఫ్లాపులను అందుకోవడమే. ఈ సినిమాల వలన ఆయనకి ఫ్లాపులు మాత్రమే కాదు .. గ్యాప్ కూడా వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నుంచి 'ఖుషి' సినిమా వచ్చింది.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయిక. ఇది ప్రేమకథా చిత్రం కావడంతో, సమంత - విజయ్ దేవరకొండ జోడీ విషయంలో చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమంత వైపు నుంచి లవ్ ట్రాక్ కరెక్టు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రిలీజ్ తరువాత కూడా అదే టాక్ బలంగా వినిపించింది. 

టైటిల్ కి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా వీకెండ్ లో బాగానే వసూళ్లను రాబట్టింది. కానీ ఆ తరువాత థియేటర్ల దగ్గర సందడి తగ్గుతూ వచ్చింది. ఆశించిన స్థాయిలో ఈ సినిమా తన దూకుడు చూపించలేకపోతోంది. ఈ నేపథ్యంలో 'జవాన్' విరుచుకుపడటం .. ఒక వర్గం వారికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బాగా నచ్చడంతో, 'ఖుషి' ప్రభావం తగ్గుతూ వచ్చింది. 



More Telugu News