హైకోర్టులో చంద్రబాబు, పి.నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్లు
- అంగళ్లు ఘటనలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్
- ఈ రెండు పిటిషన్లపై హైకోర్టులో ఈరోజు విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనలో ఏ1గా చంద్రబాబుపై కేసు నమోదయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరగనున్నాయి.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి పి.నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది.