సైమా అవార్డుల్లో విక్రమ్ హవా..!

  • రెండు అవార్డులు దక్కించుకున్న కమల్ హాసన్ మూవీ
  • ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ కు పురస్కారం
  • పొన్నియన్ సెల్వన్ సినిమాకు గానూ ఉత్తమ నటిగా త్రిషకు అవార్డు
ప్రతిష్ఠాత్మక సైమా అవార్డులలో కమల్ హాసన్ సినిమా ‘విక్రమ్’ అదరగొట్టింది. ఈ ఏడాదికి గానూ రెండు అవార్డులను దక్కించుకుంది. దుబాయ్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కమల్ హాసన్ ఈ సినిమాకు ప్రకటించిన రెండు అవార్డులను ఆయనే అందుకున్నారు. ఈ నెల 15, 16 తేదీలలో జరిగిన వేడుకల్లో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి రోజు శుక్రవారం తెలుగు, కన్నడ సినిమా రంగానికి చెందిన అవార్డులు అందించగా.. రెండో రోజు శనివారం తమిళ, మలయాళం ఇండస్ట్రీ అవార్డులు అందించారు.

తమిళంలో విక్రమ్ సినిమా ఉత్తమ నటుడు (కమల్ హాసన్), ఉత్తమ దర్శకుడు (లోకేశ్ కనగరాజ్) కేటగిరీలలో అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో నటించిన వసంతికి ఉత్తమ సహాయనటి అవార్డు దక్కింది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ అవార్డు అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్ కూడా పలు అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమాకు గానూ త్రిషను ఉత్తమ నటి అవార్డు వరించింది.


More Telugu News