కొలంబోలో వర్షం... ఆలస్యంగా ఆసియా కప్ ఫైనల్ ప్రారంభం

  • ఆసియా కప్ పై వరుణుడి పంజా
  • టోర్నీలో చాలా మ్యాచ్ లకు వాన అంతరాయం
  • ఇవాళ కొలంబోలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్
  • టాస్ గెలిచిన శ్రీలంక... వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం
శ్రీలంకలో వర్షాలు పడే సీజన్ లో క్రికెట్  మ్యాచ్ లు నిర్వహిస్తే ఎలా ఉంటుందో తాజా ఆసియా కప్ టోర్నీ చెబుతుంది. టోర్నీలో సగానికి పైగా మ్యాచ్ లు వర్షం కారణంగా అంతరాయాలు  ఎదుర్కొన్నాయి. ఇవాళ టీమిండియా, ఆతిథ్య శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డంకిగా మారాడు. 

మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న కొలంబో నగరంలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పివేశారు. 

కాసేపటికి వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఓవర్లోనే బుమ్రా టీమిండియాకు బ్రేకిచ్చాడు. లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను అవుట్ చేసి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకోవడం తెలిసిందే.


More Telugu News