ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు
- ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా విజయం
- 10 వికెట్ల తేడాతో లంకపై భారీ విజయం
- మొదట 15.2 ఓవర్లలో శ్రీలంక 50 పరుగులకు ఆలౌట్
- 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన భారత్
ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా విజయభేరి మోగించిన విధానం చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీలంక జట్టును వారి సొంతగడ్డపైనే చిత్తుగా ఓడించిన భారత్ 8వ సారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది.
కొలంబోలో జరిగిన ఈ అంతిమ సమరంలో మొదట శ్రీలంకను 15.2 ఓవర్లలో 50 పరుగులకు చుట్టేసిన భారత్... లక్ష్యఛేదనలో 6.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 51 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. ఈ చిరస్మరణీయ విజయంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీమిండియా సాధించిన ఘనత పట్ల స్పందించారు. టీమిండియా చాలా బాగా ఆడింది అని కొనియాడారు. "ఆసియా కప్ గెలిచినందుకు శుభాభినందనలు. టోర్నమెంట్ ఆసాంతం మన ఆటగాళ్లు విశేష ప్రతిభ కనబరిచారు" అని కితాబిచ్చారు.