భారత్ పై కెనడా ఆరోపణలకు అమెరికా స్పందన ఇదే..!
- కెనడా ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తీకరణ
- దర్యాప్తు కొనసాగించి నిందితులను పట్టుకోవాలన్న అమెరికా
- కెనడా-భారత్ మధ్య దిగజారిన సంబంధాలు
కెనడాలో ఖలిస్థానీ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఆ దేశం ఆరోపించడమే కాకుండా, అదే విషయాన్ని అమెరికాకు కూడా తెలియజేయడం వివాదంగా మారింది. దీనిపై అమెరికా కూడా స్పందించింది.
‘‘ప్రధాని జస్టిన్ ట్రూడూ ఈ రోజు ఉదయం ప్రస్తావించిన ఆరోపణల పట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. మా కెనడా భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంటాం. కెనడా తన దర్యాప్తును కొనసాగించి, నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టడం కీలకం’’ అని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఆండ్రినే వాట్సన్ ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది జూన్ లో ఖలిస్థానీ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్రకు సంబంధించి విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఆ దేశ పార్లమెంట్ కు మంగళవారం నివేదించడం తెలిసిందే. అంతేకాదు, దీనిపై బారత ఇంటెలిజెన్స్ విభాగం కెనడా హెడ్ ను దేశ బహిష్కరణ కూడా చేసింది. దీంతో ఇప్పటికే దిగజారిన రెండు దేశాల మధ్య సంబంధాలు కెనడా తాజా చర్యతో మరింత ప్రమాదంలో పడినట్టుగానే తెలుస్తోంది.