మరోసారి బన్నీ జోడీ కడుతున్న పూజ హెగ్డే!

  • వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే 
  • డేట్స్ కారణంగా వదులుకున్న త్రివిక్రమ్ - మహేశ్ మూవీ 
  • బన్నీ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్ 
  • వచ్చే ఏడాదిలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
పూజ హెగ్డేకి కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చినప్పుడు అదృష్టమంటే ఆమెదేనని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాలు వరుసగా పరాజయంపాలవుతూ రావడం ఆమె అభిమానులను చాలా నిరాశ పరిచింది. అయితే పూజ హెగ్డే మాత్రం ఆత్మవిశ్వాసంతోనే కొత్త ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ వెళుతోంది. 

ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమాకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది. ముందుగా పూజ హెగ్డే ఇచ్చిన డేట్స్ అయిపోయాయి .. ఆ తరువాత ఆమె తన డేట్స్ ను సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. అందువలన ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. 

కానీ ఇప్పుడు ఆమె మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో .. బన్నీ కాంబినేషన్లో సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో'తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది.  ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న 'గుంటూరు కారం' .. బన్నీ చేస్తున్న 'పుష్ప2' పూర్తి కాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.




More Telugu News