స్టీల్ పాత్రల్లో వండుతున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త!

  • స్టవ్ పై నుంచి తీసిన వెంటనే చల్లటి నీటి కింద పెట్టేయొద్దు
  • స్టెయిన్ లెస్ స్టీల్ ద్వారా శరీరంలోకి క్రోమియం
  • అసిడిక్ స్వభావం ఉన్న ఆహారాల కోసం వినియోగించొద్దు
అల్యూమినియం పాత్రలు ఆరోగ్యానికి మంచివి కావనే విషయం కొద్ది మందికి అయినా తెలుసు. స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రల్లో వండుకోవడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి స్టెయిన్ లెస్ స్టీల్ సైతం నూరు శాతం సేఫ్ అని అనుకోవద్దు. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాల పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి.

  • స్టవ్ కట్టేసిన వెంటనే వేడిగా ఉన్న పాన్ ను చల్లారనివ్వాలి. చల్లారకముందే చల్లటి నీటిలో పెట్టేశారంటే ఉష్ణోగ్రతలో ఒకేసారి అసాధారణ మార్పు చోటు చేసుకుంటుంది. దీనివల్ల స్టెయిన్ లెస్ స్టీల్ మెటల్ వ్యాకోచిస్తుంది. షేప్ బెండ్ పోవచ్చు. పాన్ అయితే మధ్యలో ఉబ్బెత్తుగా వస్తుంది. దీంతో నూనె వేసినా కానీ మధ్యలో ఉండిపోకుండా, అంచులకు చేరుతుంటుంది. 
  • అసిడిక్ స్వభావం ఉన్న ఆహార పదార్థాలను స్టెయిన్ లెస్ స్టీల్ లో ఉండికించొద్దు. 304 గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ తయారీలో 18 శాతం క్రోమియం, 8 శాతం నికెల్ ఉంటాయి. అసిడిక్ ఫుడ్ ను స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలో వండే సమయంలో క్రోమియం, నికెల్ మన శరీరంలోకి చేరే ప్రమాదం ఉంటుంది. 
  • మధ్యస్థ మంటపైనే ఖాళీ స్టెయిన్ లెస్ స్టీల్ కళాయి పెట్టి, 1, 2 నిమిషాల పాటు వేడి ఎక్కనివ్వాలి. కొంత నీరు చల్లగానే అది ఆవిరైపోతుంది.  ఆ తర్వాత నూనె వేసుకోవాలి. 
  • స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు తుప్పుబట్టడం చూసే ఉంటారు. నీరు, ఉప్పు, క్రోమియం ఉండడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది.
  • తుప్పును, ఇతర మరకలను వదిలించుకోవడానికి నీటితో కలిపిన వెనిగర్ వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
  • స్టెయిన్ లీస్ స్టీల్ పాత్ర అడుగంటిందనుకోండి.. మసిని వదలించుకునేందుకు బేకింగ్ సోడాను కొంత వేయాలి. తర్వాత మరక మునిగేంత వరకు నీరు పోయాలి. 
  • స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రల ద్వారా స్వల్ప మోతాదులో నికెల్ ఆహారంలోకి వచ్చి చేరుతుంది. ముఖ్యంగా కొత్త పాత్రలకు ఈ రిస్క్ ఎక్కువ. చాలా మందికి ఇది హాని చేయవచ్చు. కాకపోతే నికెల్ కు అలెర్జీ ఉంటే కనుక స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను వినియోగించుకోకపోవడం కరెక్ట్.
  • కాస్ట్ ఐరన్ వంటలకు సంబంధించి చాలా మన్నికవైనవి. మంచి నాణ్యమైన ట్రిపుల్ లేయర్ స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను ఉపయోగించాలి.


More Telugu News