క్రికెట్ లైవ్ లోకి ఎంట్రీ ఇస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'

  • రవితేజ ప్రధాన పాత్రలో 'టైగర్ నాగేశ్వరరావు' 
  • వంశీ దర్శకత్వంలో చిత్రం... అక్టోబరు 20న రిలీజ్
  • భారత్ లో ప్రస్తుతం వరల్డ్ కప్ పోటీలు
  • ఈ నెల 8న భారత్-పాకిస్థాన్ పోరు
  • స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ లైవ్ లోకి రవితేజ
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. 70వ దశకంలో పలు రాష్ట్రాల పోలీసులను గడగడలాడించిన స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అక్టోబరు 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లకు సన్నద్ధమవుతోంది. 

ప్రస్తుతం భారత్ లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరగనుండగా, ఇలాఖా మనదే తడాఖా మనదే అంటూ క్రికెట్ లైవ్ లోకి 'టైగర్ నాగేశ్వరరావు' ఎంట్రీ ఇవ్వనున్నాడు. తమ చానల్లో ప్రసారమయ్యే క్రికెట్ లైవ్ లో రవితేజ పాల్గొంటున్నాడని స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ వెల్లడించింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసింది. 

ఈ కార్యక్రమం అక్టోబరు 8న 12.30 గంటలకు ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ చానల్ వెల్లడించడంతో, అది భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉంటుందని తెలుస్తోంది.


More Telugu News