ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట్లో మరో విషాదం
- ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి జయరాం మరదలు మృతి
- తాజాగా మంత్రికి మాతృవియోగం
- అనారోగ్యంతో కన్నుమూసిన శారదమ్మ
- ఈ సాయంత్రం స్వగ్రామం గుమ్మనూరులో అంత్యక్రియలు
ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జయరాం మరదలు మృతి చెందగా, తాజాగా, జయరాం తల్లి శారదమ్మ కన్నుమూశారు. శారదమ్మ వయసు 79 సంవత్సరాలు. మంత్రి జయరాం స్వగ్రామం ఆలూరు నియోజకవర్గం గుమ్మనూరులో శారదమ్మ అంత్యక్రియలు ఈ సాయంత్రం నిర్వహించనున్నారు.
మంత్రి జయరాం మాతృమూర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలల వ్యవధిలోనే రెండు మరణాలు సంభవించడంతో మంత్రి జయరాం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కాగా, శారదమ్మ భౌతికకాయానికి పలువురు వైసీపీ నేతలు నివాళులు అర్పించారు. శారదమ్మ గతంలో గుమ్మనూరు గ్రామ సర్పంచిగా సేవలు అందించారు.