తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు... మరో రెండ్రోజుల్లో సీట్ల అంశం ఖరారు

  • తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు
  • షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం 
  • కాంగ్రెస్ తో పొత్తుపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
  • పొత్తుపై రాజకీయ అవగాహన కుదిరిందని వెల్లడి
  • కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అనే ప్రచారంలో నిజం లేదని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వానికి తెరలేచింది. ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెట్టుకుందని వెల్లడించారు. ఆ మేరకు ఇరుపార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని తెలిపారు.

జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ అదే అవగాహనతో పొత్తును ముందుకు తీసుకెళతామని చెప్పారు. 

అయితే, సీపీఐ బరిలో దిగే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదని, మరో రెండ్రోజుల్లో సీట్ల అంశం ఖరారవుతుందని నారాయణ వివరించారు. వామపక్ష పార్టీలకు చెరో రెండు సీట్లు అని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదనేదీ తమకు రాలేదని అన్నారు.


More Telugu News