హిందీలో ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఏ అంశం గురించి అంటే..!
- అప్పుడప్పుడు హిందీలో కూడా ట్వీట్లు చేస్తున్న విజయసాయి
- దేశంలో చక్కెర కొరతపై తాజా ట్వీట్
- చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని కేంద్రానికి సూచన
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా ఆసక్తిగా ఉంటారనే విషయం తెలిసిందే. కేవలం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం మాత్రమే కాకుండా... పలు అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు. అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల వారికి కూడా అర్థమయ్యేలా హిందీలో ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి హిందీలో ట్వీట్ చేశారు. దేశంలో చక్కెర కొరతపై కేంద్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
'దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి సగటు కంటే తక్కువగా ఉంది. దీనికి కారణం అసాధారణ రుతుపవనాలు. పండుగల సీజన్ వచ్చిందంటే మార్కెట్లో చక్కెరకు డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా చక్కెర అందుబాటులో ఉండేలా కేంద్రం చూడాలి. దీని కోసం ప్రభుత్వం చక్కెర ఎగుమతిపై నిషేధం విధించాల్సిన అవసరం ఉంటే, అలా చేయడానికి వెనుకాడకూడదు' అని చెప్పారు.