చంద్రబాబు ఎప్పుడు పోతాడా... టీడీపీని జనసేనలో ఎప్పుడు కలుపుకుందామా? అనేది పవన్ కల్యాణ్ తాపత్రయం: వెల్లంపల్లి శ్రీనివాస్
- చంద్రబాబుపై పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శ
- చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానం ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచన
- చంద్రబాబు ఎందుకూ పనికి రాడని కుటుంబ సభ్యులే చెబుతున్నారని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రయివేటు వైద్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు అడగడం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ప్రశ్నించారు. పవన్ షూటింగ్స్‌తో ఫామ్ హౌస్‌లో బిజీగా ఉంటాడన్నారు. చంద్రబాబు మీద జనసేనాని మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోతాడా? ఎప్పుడు టీడీపీని జనసేనలో కలుపుకుందామా? అని తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. అంతేకానీ చంద్రబాబు మీద పవన్‌కు ఏమాత్రం ప్రేమ లేదన్నారు.
ఇక, చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీకి అనుమానం ఉంటే కోర్టుకు వెళ్లాలని వెల్లంపల్లి సూచించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... సంకేళ్లు వేసుకోవడం ద్వారా తమకూ సంకేళ్లు వేయాలని టీడీపీ పిలుస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. టీడీపీ తలపెట్టిన న్యాయానికి సంకేళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేదన్నారు. రోజుకు 24 గంటలు ఉంటే కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు.
చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ద్వారా కోర్టు పరిధిలో ఉన్నారన్నారు. కోర్టు పరిధిలోకి వెళ్లాక ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. టీడీపీ వాళ్లని చూసి వాళ్ల కేడరే నవ్వుకుంటోందన్నారు. చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదని, తప్పుడు మనిషి అన్నారు. 30 రోజులకే చంద్రబాబు తుప్పు బయటపడిందన్నారు. ఆయనకు లేని రోగం అంటూ ఏదీ లేదని కుటుంబ సభ్యులే దేశమంతా ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయనకు ఉన్న రోగాలు ఈ నెల రోజుల్లో వచ్చినవి కాదని, ఆయన ఎందుకూ పనికిరాడని కుటుంబ సభ్యులే చెబుతున్నారన్నారు.