రాహుల్ గాంధీ... నీకు తెలివిలేదేమో... రేవంత్ గురించి నీకు తెలియదు: కేటీఆర్
- రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్... మీ పార్టీని గంపగుత్తగా తీసుకెళ్తాడన్న కేటీఆర్
- మేం ఎవరికీ బీ టీమ్ కాదని కాంగ్రెస్ చోర్ టీమ్ అని కేటీఆర్ విమర్శ
- ఏ నుంచి జెడ్ వరకు కాంగ్రెస్ కుంభకోణాలకు లెక్కలేదన్న కేటీఆర్
తాము ఎవరికీ 'బీ' టీమ్ కాదని, కాంగ్రెస్ పార్టీయే ఒక 'సీ' టీమ్ అని, అంటే చోర్ టీమ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము బీజేపీకి బీ టీమ్ అంటున్నాడని, కానీ కాంగ్రెస్ చోర్ టీమ్ అన్నారు. ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఏ అంటే ఆదర్శ్ స్కామ్, బీ ఆంటే బోఫోర్స్ స్కామ్, సీ అంటే కామన్వెల్త్ స్కామ్.. ఇలా జెడ్ వరకు ఉన్నాయన్నారు.
ఆకాశం నుంచి పాతాళం వరకు దోచుకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఆకాశంలో ఎగిరే అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు వరకు దేనినీ వదలకుండా దోచుకుందన్నారు. స్వయంగా కేంద్రమంత్రులు జైలుకెళ్లారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులు వచ్చి తమను విమర్శిస్తున్నారన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పది మంది గెలిచినా పన్నెండు మంది గెలిచినా రేవంత్ రెడ్డి వారిని గంపగుత్తగా తీసుకొని వెళ్లి బీజేపీలో చేరుతారన్నారు.
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సంగతి తెలియదని, బీజేపీ మీ పార్టీలో పెట్టిన కోవర్టే రేవంత్ అన్నారు. రేపు ఎన్ని సీట్లు గెలిచినా వారిని బీజేపీకి తీసుకువెళ్తాడన్నారు. ఈ విషయంలో మీకు తెలివి లేదేమో కానీ పక్కన ఉన్నవారిని అడగాలని రాహుల్ గాంధీకి సూచించారు. బీజేపీనే ఆయనను మీ కాంగ్రెస్ పార్టీలోకి పంపించిందన్నారు. రేవంత్ మీ పార్టీని మింగడం ఖాయమన్నారు.