ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో... వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్

  • కరెంట్ ఇస్తారా? లేదా? అంటూ కర్ణాటకలోని సబ్ స్టేషన్ కు తరలి వచ్చిన రైతుల వీడియో ట్వీట్
  • తమకు కరెంట్ ఇవ్వకుంటే మొసలిని సబ్ స్టేషన్లో వదిలేస్తామని హెచ్చరించిన రైతులు
  • వీడియో రీట్వీట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీకి చురకలు అంటించిన కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్దిష్ట పరిమితి ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడం లేదని, ఇందుకు నిదర్శనం ఇదే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అని క్యాప్షన్ పెట్టారు.

యాక్యువల్ ఇండియా అనే ఎక్స్ హ్యాండిల్ (ట్విట్టర్ హ్యాండిల్) ద్వారా కర్ణాటకకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో పేర్కొన్న దాని ప్రకారం తమకు కరెంట్ ఇస్తారా? లేక మొసలిని సబ్ స్టేషన్‌లో వదలాలా? అంటూ కర్ణాటక రైతులు కొంతమంది ఓ ట్రాక్టర్‌లో ఓ మొసలిని తీసుకు వచ్చారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేసి, ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అని చురకలు అంటించారు. కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కాంగ్రెస్ తెలంగాణలోనూ ఇచ్చింది.


More Telugu News