వరల్డ్ కప్ లో నేడు టీమిండియా మ్యాచ్... టాస్ గెలిచిన ఇంగ్లండ్
- లక్నోలో టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- టీమిండియాకు మొదట బ్యాటింగ్
వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేయనుంది.
నెట్స్ లో రోహిత్ శర్మకు గాయమైనట్టు వార్తలు రావడంతో కొంచెం ఆందోళన నెలకొన్నా, రోహిత్ టాస్ కు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్ కు టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. అటు, వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్నప్పటికీ, ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతోంది.
ఇప్పటివరకు టోర్నీలో 5 మ్యాచ్ లు ఆడి అన్నింట్లోనూ గెలిచిన టీమిండియా... నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై నెగ్గితే సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటిదాకా 5 మ్యాచ్ లు ఆడి కేవలం ఒకదాంట్లోనే నెగ్గింది. ఇవాళ్టి మ్యాచ్ తో కలిపి ఇంగ్లండ్ ఇంకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, అన్నింట్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ఏవైనా సెమీస్ చాన్సులు ఉంటాయి. అది కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.