కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం వెనుక రాజకీయ కుట్ర ఉందా? అన్నది దర్యాఫ్తు చేస్తాం: హరీశ్ రావు
- కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్, ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న హరీశ్ రావు
- ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న మంత్రి హరీశ్ రావు
- సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు చెప్పిన మంత్రి
- కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఆందోళన చెందవద్దన్న హరీశ్ రావు
ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. మెరుగైన చికిత్స కోసం ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు కత్తితో దాడి చేయడంతో కడుపులో గాయాలైనట్లు చెప్పారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్ రావు అన్నారు. హత్యాయత్నం వెనుక రాజకీయ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు.