ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యారు: కేటీఆర్ విమర్శలు

  • పొరపాటున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శలు
  • రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో చూడాలన్న కేటీఆర్
  • కేసీఆర్‌ను కొట్టేందుకు మోదీ సహా ఢిల్లీ నేతలు వరుస కడుతున్నారన్న మంత్రి
ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, ఇవాళ సీటుకు రేటు రేవంత్ రెడ్డి తీరు అని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పొరపాటున రేవంత్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్మడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి రేవంత్ రెడ్డి వచ్చాక ఎలా ఉందో చూడవచ్చన్నారు.

సమైక్య పాలనలో మహబూబ్‌నగర్‌ మైగ్రేషన్‌... కానీ ఇప్పుడు మహబూబ్‌నగర్‌ అంటే ఇరిగేషన్‌ అన్నారు. 14.50 లక్షల ఎకరాలకు పాలమూరులో నీరు అందుతోందన్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారని.. 15 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, అమిత్ షా, నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు అంతా తెలంగాణకు క్యూ కడుతున్నారన్నారు. కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది తెలంగాణకు రావాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ సింహంలా సింగిల్‌గా వస్తారన్నారు.


More Telugu News