జగన్ సర్కారు విపక్షాల పైనే కాదు అధికారులపై కూడా సీఐడీ అస్త్రం సంధిస్తోంది: దేవినేని ఉమా

  • ఓ పత్రికా కథనంపై ఘాటుగా స్పందించిన దేవినేని ఉమా
  • ఎన్నికల విధుల్లోని ముఖ్య అధికారిని బెదిరించారని ఆరోపణ
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సీఎం జగన్ పై విమర్శలు
"మాట వినకుంటే కేసే... సీఐడీని ఎదుర్కోవడానికి సిద్ధపడండి" అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారికి వార్నింగ్ ఇచ్చిందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు వద్దంటే అంటూ వివరణ ఇచ్చారు. 

ప్రతిపక్షాల పైనే కాదు... అధికారులపై కూడా జగన్ సర్కారు సీఐడీ అస్త్రం సంధిస్తోందని విమర్శించారు. మాట వినకపోతే కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని... ప్రతిపక్షాల వినతులను పక్కన పడేయండి అంటూ ఎన్నికల విధుల్లోని ముఖ్య అధికారికి బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్... ఎన్నికల వ్యవస్థపై బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని దేవినేని ఉమా విమర్శించారు.


More Telugu News