ట్రావిస్ హెడ్ సెంచరీ... టీమిండియా గెలుపుపై సన్నగిల్లిన ఆశలు
- అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
- ఆసీస్ కు 241 పరుగుల టార్గెట్ నిర్దేశించిన టీమిండియా
- ప్రస్తుతం ఆసీస్ స్కోరు 35 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు
- 95 బంతుల్లో 100 పరుగులు చేసిన హెడ్
వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించాడు. 241 పరుగుల లక్ష్యఛేదనలో 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను హెడ్ ఆదుకున్నాడు. లబుషేన్ తో కలిసి 100కి పైగా పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్ ను ట్రాక్ లో నిలబెట్టాడు. హెడ్ 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. హెడ్ 14 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. మరో ఎండ్ లో లబుషేన్ 41 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 35 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు. ఆసీస్ విజయానికి 90 బంతుల్లో 49 పరుగులు కావాలి. చేతిలో ఇంకా 7 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఇక టీమిండియా గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.