రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ రామ్‌గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్
- తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అని ‘ఎక్స్’ వేదికగా సినీ డైరెక్టర్ స్పందన
- కొత్త సీఎం రేవంత్ అని తెలియడం చాలా చాలా గర్వంగా ఉందని ప్రశంసలు
- రేవంత్ రెడ్డితో దిగిన ఫొటోను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా పేరు ఉన్నప్పటికీ వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓటములతో తెలంగాణ కాంగ్రెస్ డీలా పడింది. పార్టీ కేడర్‌లో నైరాశ్యం, కార్యకర్తల్లో నిరుత్సాహం నిండిన స్థితి నుంచి నేడు హస్తం పార్టీ ఏకంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిందంటూ విస్తృత చర్చలు, బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమనేలా రాజకీయ ముఖచిత్రం మారిపోయిన నుంచి అధికారంలోకి తీసుకురావడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాబోయే సీఎం అంటూ విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు.
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘వారియర్ కింగ్’ అని రామ్‌గోపాల్ వర్మ ప్రశంసించాడు. కొత్త సీఎం రేవంత్ అని తెలియడం చాలా చాలా గర్వంగా ఉందని అభినందించాడు. కోటానుకోట్ల అభినందనలు అని పేర్కొంటూ ‘ఎక్స్’ వేదికగా రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రేవంత్ రెడ్డితో ఉన్న తన ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశారు. ఇదిలావుండగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఏకంగా 64 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకుంది. ఇక 39 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు, సీపీఐ 1 సీటు గెలుచుకున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుండడం, రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పందన ఆసక్తికరంగా మారింది.