రామ్ చరణ్ నివాసంలో సందడి చేసిన నెట్ ఫ్లిక్స్ సీఈవో... ఫొటోలు ఇవిగో!
- హైదరాబాద్ వచ్చిన నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్
- నేరుగా రామ్ చరణ్ నివాసానికి రాక
- హార్దిక స్వాగతం పలికిన రామ్ చరణ్
- సరాండోస్ తో భేటీలో పాల్గొన్న రామ్ చరణ్, చిరంజీవి తదితరులు
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ స్థాయిలో వెలుగులు విరజిమ్మిన నేపథ్యంలో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫేమ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. రామ్ చరణ్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు తారాపథానికి ఎగసింది.
తాజాగా, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ హైదరాబాద్ లో అడుగుపెట్టి, నేరుగా రామ్ చరణ్ నివాసానికి విచ్చేశారు. రామ్ చరణ్ ను కలిసి అనేక సంగతులు ముచ్చటించారు. భారత్ లో తమ తదుపరి ప్రణాళికల గురించి, వ్యాపార విస్తరణ, సినిమాలు తదితర అంశాలపై చర్చించారు.
కాగా, ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొనడం విశేషం. చిరంజీవితోనూ టెడ్ సరాండోస్ ఉత్సాహంగా మాట్లాడారు. ఈ భేటీలో రామ్ చరణ్, చిరంజీవి మాత్రమే కాదు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సోదరులు కూడా పాల్గొన్నారు.