కిషన్ రెడ్డికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని విజ్ఞప్తి
  • త్వరలో కేంద్ర ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి
  • ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా బుధవారం ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజులలో నివేదిక అందించాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను నివేదికలో పొందుపరచాలన్నారు. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.


More Telugu News