దేశంలో మళ్లీ కరోనా కేసులు... రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
- భారత్ లో మళ్లీ కరోనా కలకలం
- గడచిన 24 గంటల్లో 335 పాజిటివ్ కేసులు
- కరోనాతో ఐదుగురి మృతి
- కరోనా లక్షణాలు ఉంటే ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయాలన్న కేంద్రం
- ప్రతి జిల్లాలోనూ పరిస్థితిని సమీక్షించాలని స్పష్టీకరణ
భారత్ లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా లక్షణాలు ఉంటే ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయాలని పేర్కొంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసింది.
భారత్ లో ప్రస్తుతం ఎక్స్ బీబీ వేరియంట్ తో పాటు జేఎన్1 సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 335 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది.