ఢిల్లీలో కళ్లు చించుకున్నా కనిపించని దారి.. 110 విమానాలు, 25 రైళ్లపై ప్రభావం
- మంచు దుప్పట్లో చిక్కుకున్న ఉత్తరభారతం
- జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ
- ఢిల్లీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ఢిల్లీని పొగమంచు కప్పేసింది. నగరంపై దుప్పటిలా పరుచుకున్న మంచు కారణంగా కళ్లు చించుకున్నా దారి కనబడడం లేదు. విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు దట్టంగా పరుచుకోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 110 విమాన రాకపోకలపై ప్రభావం పడింది. అలాగే, 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మరోవైపు, మంచు కౌగిలిలో నలిగిపోతున్న ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీ మాత్రమే కాదు, ఉత్తర భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో చలిగాలులు భయపెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.