ఓలా, ఉబర్, గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త

  • రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ
  • డిసెంబర్ 23న గిగ్ వర్కర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి
  • భద్రత సహా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లిన గిగ్ వర్కర్లు
గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓలా, ఉబర్, గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల బీమా కల్పిస్తూ శనివారం జీవో జారీ చేసింది. డిసెంబర్ 23వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా ఆన్‌లైన్ యాప్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లపై పని చేసే గిగ్ వర్కర్లు దాదాపు మూడున్నర లక్షలమంది ఉన్నట్లు గుర్తించారు.

గతవారం సీఎంతో భేటీ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత సహా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారికి ప్రమాద బీమా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీ హబ్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల కోసం యాప్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని సీఎం తెలిపారు. అంతేకాదు, ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే గ్రామ, వార్డు సభలలో గిగ్ వర్కర్లు తమ వివరాలతో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.


More Telugu News