విశాఖ లోక్‌సభ బరిలోకి బొత్స ఝాన్సీ.. త్వరలో ప్రకటన?

  • విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటన
  • ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని వైనం
  • పరిశీలనలో బొత్స ఝాన్సీ పేరు
రానున్నలోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మి విశాఖపట్టణం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తరపున అక్కడి నుంచి పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమె విజయనగరం నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఝాన్సీ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను విశాఖ లోక్‌సభకు పోటీ చేయించే విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.


More Telugu News