'వ్యూహం' సినిమాకు మరో ఎదురుదెబ్బ.. ఓటీటీలోనూ విడుదల చేయొద్దన్న కోర్టు!
- వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ కోర్టుకెక్కిన నారా లోకేశ్
- వ్యూహం సినిమాపై తీర్పును 22కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
- ఆన్‌లైన్, ఓటీటీ, ఇంటర్నెట్ వేదికల్లోనూ విడుదల చేయొద్దన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు
వ్యూహం సినిమా విషయంలో నిర్మాతకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా విడుదల ఇప్పటికే వాయిదా పడింది. ఈ సినిమాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఎఫ్‌సీ జారీచేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ ఉత్తర్వులపై వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. విచారణ ముగియడంతో నిన్నటికి తీర్పును వాయిదా వేసిన కోర్టు.. నిన్న మరోమారు వాయిదా వేస్తూ ఈ నెల 22న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. మరోవైపు, వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ వేదికల్లోనూ విడుదల చేయవద్దని నిన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.