ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అధ్యక్షుడితో రేవంత్ రెడ్డి సమావేశం

  • సీ4ఐఆర్‌ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన
  • ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలు ఉంటాయన్న రేవంత్ రెడ్డి
  • ప్రపంచ ఆర్థిక ఫోరం భాగస్వామ్యంతో లక్ష్యాలను చాలా వేగంగా చేరుకోవచ్చునని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం సీఎం ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. పెట్టుబడులను సమీకరించేందుకు ఆయన వరుసగా పలువురితో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం... సీ4ఐఆర్‌ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయో ఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్ ప్రారంభం కానుంది. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలు ఉంటాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక ఫోరం భాగస్వామ్యంతో లక్ష్యాలను చాలా వేగంగా చేరుకోవచ్చునన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. మెడ్‌ట్రానిక్‌ సీఈఓతో భేటీలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.


More Telugu News