రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు... చెప్పు తీసి చూపించిన బీఆర్ఎస్ నేత
- కేసీఆర్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద బాల్క సుమన్ మండిపాటు
- ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహం
- తనకు సంస్కారం అడ్డు వస్తోందని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సోమవారం భగ్గుమన్నారు. వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. బాల్క సుమన్ కూడా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. అనంతరం ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు.
రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. కేసీఆర్ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అంటూ దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి... తన పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని సూచించారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.7,700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కి, కాంగ్రెస్ కంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్ళించారని ఆరోపించారు.